ముంబై, 12 సెప్టెంబర్ (హి.స.)మన దేశంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగా ఉంటాయి. డాలర్ మారకపు విలువ దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఈ నేపధ్యంలో దేశీయంగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. బంగారం స్వచ్చత పెరిగే కొద్దీ ధర పెరుగుతుంది.
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10గ్రామల ధర రూ. 110500, 22 క్యారెట్ల బంగారంరూ.1,01,290లకు చేరుకుంది. ఇవే ధరలు కోల్‌కతా, బెంగళూరు , కేరళ, పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.
వెండి ధర
బంగారం తర్వాత అత్యంత ఇష్టంగా కొనుగోలు చేసే లోహం. వెండి . గత కొంతకాలంగా వెండి ధర చుక్కలను తాకుతూ దూసుకుపోతుంది. ఓ వైపు వెండి వినియోగం ఎక్కువ కావడం, మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం అత్యంత సురక్షితం అని ముదుపరులు భావించడం వలన వెండి ధరలు రోజు రోజుకీ పై పైకి చేరుకుంటున్నాయి. బంగారం బాటలోనే పయనిస్తూ వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఈ నేపధ్యంలో ఈ రోజు వెండి ధర దేశ రాజధాని డిల్లీ మినహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి కి 100 లు తగ్గి.. నేడు 1,39,900లకు చేరుకుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం కిలో వెండి ధర రూ. 1,29,800లుగా కొనసాగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి