పాట్నా:/న్యూఢిల్లీ,12,సెప్టెంబర్ (హి.స.) బిహార్ కాంగ్రెస్ (Bihar Congress) మరోసారి వివాదంలో చిక్కుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ఆయన దివంగత మాతృమూర్తి హీరాబెన్ మోదీ (Heeraben Modi) పోలికలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేసింది. 36 సెకెండ్ల ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ తరహా వీడియోను కాంగ్రెస్ విడుదల చేయడం వ్యక్తిగత దాడిగా బిజేపీ (BJP) నిప్పులు చెరిగింది.
'సాహబ్ కలలోకి అమ్మ వచ్చింది' అనే శీర్షికతో బిహార్ కాంగ్రెస్ ఈ వీడియోను విడుదల చేసింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల మనోభావాలను గాయపరచేందుకు ఉద్దేశించిన వీడియోగా బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు