వైష్ణోదేవి యాత్ర తిరిగి ప్రారంభం.
శ్రీనగర్న్యూఢిల్లీ,12,సెప్టెంబర్ (హి.స.): భారీ వర్షాలు, వాతావరణ ప్రతికూలతలతో సస్పెండ్ అయిన మాతా వైష్ణోదేవి యాత్ర (Vaishno Devi Yatra) ఈనెల 14 నుంచి తిరిగి ప్రారంభమవుతోంది. రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన
Vaishno Devi


శ్రీనగర్న్యూఢిల్లీ,12,సెప్టెంబర్ (హి.స.): భారీ వర్షాలు, వాతావరణ ప్రతికూలతలతో సస్పెండ్ అయిన మాతా వైష్ణోదేవి యాత్ర (Vaishno Devi Yatra) ఈనెల 14 నుంచి తిరిగి ప్రారంభమవుతోంది. రియాసీ జిల్లాలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు చేపట్టిన యాత్ర క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడుతుండటంతో 19 రోజులుగా తాత్కాలికంగా నిలిచిపోయింది.

కాగా, వాతావరణ అనుకూలతను పరిగణనలోకి తీసుకుని ఈనెల 14వ తేదీ ఆదివారం నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు (SMVDB) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది. యాత్ర వివరాలు, బుకింగ్స్‌ కోసం www.maavaishnodevi.orgను చూడాలని కోరింది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande