దేశ రాజధానిలో మరోసారి అలజడి.. తాజ్ ప్యాలెస్కు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ, 13 సెప్టెంబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఇవాళ మధ్యాహ్నం లోపు పేల్చేస్తామంటూ తాజ్ ప్యాలెస్ హోటల్కు ఆగంతకులు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. హోటల్లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతోందని అందులోని సా
బాంబు బెదిరింపు


న్యూఢిల్లీ, 13 సెప్టెంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీ నగరం

మరోసారి ఉలిక్కిపడింది. ఇవాళ మధ్యాహ్నం లోపు పేల్చేస్తామంటూ తాజ్ ప్యాలెస్ హోటల్కు ఆగంతకులు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపారు. హోటల్లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతోందని అందులోని సారాంశం. దీంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేశారు. ఈ మేరకు వారు డాగ్, బాంబ్ స్వ్కాడ్తో ఘటనా స్థలానికి చేరుకుని విస్తృంతా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువులు, బ్యాగేజీలను దూరంగా తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు. ఇక శుక్రవారం ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని బాంబే హైకోర్టు అధికారులకు దక్షిణ ముంబైలోని చారిత్రక కోర్టు భవనాన్ని కూల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్ రాగా.. బాంబ్ స్వ్కాడ్ ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఎలాంటి బాంబులు లేవని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande