న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.)బిహార్‌లో ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ కసరత్తు చేపట్టేందుకు ఎన్నికల సంఘం (EC) సన్నద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ను నిర్వహించాలని సుప్రీంకోర్టు (Supreme Court)లో దాఖలైన పిటిషన్‌కు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికల జాబితా సవరణ, ఎన్నికల ప్రక్రియను చేపట్టే ప్రత్యేక అధికారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు సమగ్ర సర్వేను చేపట్టాలంటూ నిరంతర ఆదేశాలు ఇవ్వడం.. తమ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందంటూ వ్యాఖ్యానించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ