న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.)2025-26 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థికవ్యవస్థ 7.8శాతం వృద్ధిని సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా (Make in India) ద్వారా దేశం చేసే ఎగుమతుల్లో వృద్ధిని సాధించగలిగామన్నారు. కాంగ్రెస్ (Congress) హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించారని ప్రధాని మండిపడ్డారు. ‘‘2014కి ముందు టూత్‌పేస్ట్, సబ్బు, నూనె వంటి రోజువారీ నిత్యావసర వస్తువులకు కూడా 27 శాతం పన్ను విధించేవారు. నేడు వీటిపై కేవలం 5శాతం జీఎస్టీ (GST) మాత్రమే వర్తిస్తుంది. కాంగ్రెస్ హయాంలో ఔషధాలు, బీమాపై అధిక పన్నులు విధించడం వల్ల సాధారణ కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ చాలా ఖరీదైనదిగా మారింది’’ అని అన్నారు.
తమ ప్రభుత్వం చేపట్టిన జీఎస్టీ సవరణలతో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల మందుల ధరలు తగ్గుతాయని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. కార్లు, బైక్‌లను తయారుచేసే అనేక కంపెనీలు ఇప్పటికే ధరలను తగ్గించాయని.. సెప్టెంబర్ 22 తర్వాత సిమెంట్ నిర్మాణ సామగ్రి కూడా చౌకగా మారతాయని ప్రధాని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ