బీసీసీఐకి జాతీయ భావం లేదా? ఆ మ్యాచ్ ఎవ్వరూ చూడొద్దు..పహల్గామ్ బాధితురాలు ఫైర్
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.) పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన శుభం ద్వివేది భార్య ఐషాన్య ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరగబోయే భారత్ పాకిస్థాన్ మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. టీవీలో కూడా ఎవరూ ఆ మ్యాచ్ చూడవద్దని ఐషాన్య కోరారు. ఓ మ
క్రికెట్ మ్యాచ్


హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)

పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన

శుభం ద్వివేది భార్య ఐషాన్య ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరగబోయే భారత్ పాకిస్థాన్ మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. టీవీలో కూడా ఎవరూ ఆ మ్యాచ్ చూడవద్దని ఐషాన్య కోరారు. ఓ మీడియా ఛానల్తో ఆమె మాట్లాడుతూ..... భారత క్రికెట్ బోర్డ్కు పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల జాలి లేదని విమర్శించారు. ఈ ఇండియా పాక్ మ్యాచ్ బహిష్కరించాలని ప్రజలను కోరారు. మ్యాచ్ చూడ్డానికి వెళ్లకండి, టీవీలో కూడా చూడకండి అంటూ వ్యాఖ్యానించారు.

ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ను బీసీసీఐ అంగీకరించకూడదని అన్నారు. 26 కుటుంబాల పట్ల ఆపరేషన్ సిందూర్ అమరుల పట్ల బీసీసీఐకి ఎలాంటి ఎమోషనల్ లేదని తాను భావిస్తున్నానన్నారు. అంతే కాకుండా ఇద్దరు క్రికెటర్లు తప్ప మరే ఆటగాడు ఇండియా పాక్ ఆటను బహిష్కరించాలని పిలుపునివ్వడానికి ముందుకు రాలేదని చెప్పారు. మన క్రికెటర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

క్రికెటర్లు జాతీయ వాదులని అంటారు, క్రికెట్ జాతీయ క్రీడగా చూస్తారు కానీ మ్యాచ్ బహిష్కరించాలని చెప్పడానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీసీసీఐని ఎవరూ తుపాకీతో బెదిరించి ఆడాలని బలవంతం చేయడంలేదని, వాళ్లు తమ దేశం తరుపున నిలబడాలి కానీ అలా చేయడంలేదని మండిపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande