మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ update
న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.)ప్రధాని మోడీ శనివారం మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించారు. మిజోరాంలోని బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మిజోరాం రాలేనందుకు క్షమించాలని ప్రజలను క
Mizoram


న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.)ప్రధాని మోడీ శనివారం మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించారు. మిజోరాంలోని బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మిజోరాం రాలేనందుకు క్షమించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భగా మోడీ మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ కేవలవం రైల్వే కనెక్షన్ కంటే ఎక్కువ అని.. ఇది మిజోరాంకు పరివర్తనకు జీవనాడిగా అభివర్ణించారు. ఇది జీవితాలను, జీవనోపాధిని విప్లవాత్మకంగా మారుస్తుందని చెప్పారు.

భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చెప్పారు. 2025-26 మొదటి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి చెందిందని.. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఎగుమతుల పురోగతే కారణం అని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో మేడ్-ఇన్-ఇండియా ఆయుధాలే కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు.

ఇక జీఎస్టీ సంస్కరణలను కూడా ప్రధాని ప్రశంసించారు.

మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు రైల్వే లైన్‌ వేసే ప్రాజెక్టుకు ప్రధాని మోడీ 2014లో శంకుస్థాపన చేశారు. అప్పటిదాకా మిజోరంలోని బైరాబి వరకు మాత్రమే రైల్వే లైను ఉండేది. అసోం సరిహద్దుకు సమీపంలోని ఈ స్టేషన్‌ వరకు లైన్‌ ఉన్నప్పటికీ మిజోరం ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అందుకే రాజధాని ఐజ్వాల్‌ను కలిపే లక్ష్యంతో ఈ బైరాబి నుంచి ఐజ్వాల్‌ పక్కనుండే సాయ్‌రంగ్‌కు లైన్‌ ప్రాజెక్ట్ చేపట్టారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande