భారత్‌పై సుంకం అంత తేలికైన పని కాదు, సంబంధాలు దెబ్బతిన్నాయి..
న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.) రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అంగీకరించారు. ‘‘భారతదేశం రష్యాకు అతిపెద్ద కస్టమర్. భ
U.S. President Donald Trump to lift sanctions imposed on Syria.


న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.) రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం అంగీకరించారు. ‘‘భారతదేశం రష్యాకు అతిపెద్ద కస్టమర్. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల నేను 50 శాతం సుంకం విధించాను. అది చేయడం తేలికైన విషయం కాదు.’’ అని ట్రంప్ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాకు నిధులు సమకూరుస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో ట్రంప్ సర్కార్ 50 శాతం సుంకాలు విధించినట్లు సమర్థించుకుంటోంది. అయితే, ఈ నిర్ణయంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ‘‘సుంకాలు విధించడం అతిపెద్ద విషయమని, అది భారత్‌తో అమెరికా సంబంధాల్లో చీలికకు కారణమైంది’’ అని ట్రంప్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande