సైన్స్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలి.. ఆదిలాబాద్ ఎంపీ
నిర్మల్, 14 సెప్టెంబర్ (హి.స.) నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో రూ. 13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగ శాలను ఆదివారం అదిలాబాద్ ఎంపీ జి నగేష్, ఖానాపూర్ ఎ
ఆదిలాబాద్ ఎంపీ


నిర్మల్, 14 సెప్టెంబర్ (హి.స.)

నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో రూ. 13 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగ శాలను ఆదివారం అదిలాబాద్ ఎంపీ జి నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ ప్రయోగశాల ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande