తెలుగు రాష్ట్రాలను వదలని వరుణుడు.. పలు జిల్లాల్లో భారీ వర్షం.. కొన్నిచోట్ల కుండపోత
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. దీంతో ఉరుములు మెరుపులతోపాటు.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంద
rain


అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.. దీంతో ఉరుములు మెరుపులతోపాటు.. కుండపోత వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. దక్షిణకోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande