ఆసిఫాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
దాబా వాగు మడుగులో పడి మృతి
చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కోరారు. ఆదివారం వాంకిడి మండలంలోని దాబా గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. చిన్నారుల మృతదేహాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బాధిత మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమైన విషయమని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అధికారులు తాగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సంఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను స్థానిక గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించేలా చేస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు