హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
కాంగ్రెస్ మంత్రులు గ్రూప్-1 పోస్టులను అంగట్లో పెట్టి అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక వీడియో రిలీజ్ చేశారు. గ్రూప్ 1 నియామకాలపై ఆరోపణలు చేసిన కేటీఆర్ను చెప్పుతో కొట్టాలని ఎంపీ చామల ఫైర్ అయ్యారు. 563 మంది అభ్యర్థుల దగ్గర రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగ నియామకాలు చేసినట్లు కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని ఉద్యోగం చేస్తూ ఇండియాకు వచ్చి మంత్రి పదవి చేపట్టిన కేటీఆర్ రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్ కు గ్రూప్ 1 అభ్యర్థుల తల్లిదండ్రులు బుద్ధి చెప్పాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..