జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సీఎం మాస్టర్ ప్లాన్!
హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ను బరిలోకి దించాలని నిర్ణ
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ను బరిలోకి దించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముస్లిం మైనార్టీ తర్వాత యాదవ ఓటర్లు ఎక్కువగా ఉండటం బీసీ నినాదం కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అసదుద్దీన్, మజ్లిస్ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంచనా తో మీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande