హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం' బండి సంజయ్
హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) ‘హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం'' అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ''హిందీ దివస్''ను పురస్కరించుకుని ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్లో
బండి సంజయ్


హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

‘హిందీ కేవలం ఒక భాష మాత్రమే కాదు. కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి ప్రతిరూపం' అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. 'హిందీ దివస్'ను పురస్కరించుకుని ఆదివారం గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన 'హిందీ దివస్' కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాష అనేది నాగరికత మరియు సంస్కృతికి ఆత్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్లుగా భాష కేవలం వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, జాతీయ చైతన్యానికి ఆత్మ. మోడీ నాయకత్వంలో భారత్ నేడు ఆత్మనిర్భరత వైపు, విశ్వగురువుగా మారే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర భారతానికి అతి పెద్ద శక్తి దాని స్థానిక భాషలు, మాతృభాషలే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande