హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర,
కర్ణాటకలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో కూడా అధికారికంగా నిర్వహించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం కూడా అధికారికంగా దినోత్సవం జరుపుతోందని గుర్తుచేశారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అన్నారు. ఎమ్ఐఎమ్కు భయపడి గత ప్రభుత్వం నిర్వహించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా కూడా నిర్వహించడం లేదు. అందరూ ఎమ్ఐఎమ్కు భయపడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పేర్కొన్నారు.
కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్, మహారాష్ట్ర మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..