న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు చైనాపై సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాటో దేశాలను కోరారు. నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని ఆయన ఓ లేఖలో కోరారు. చైనాపై 100 శాతం సుంకాలు విధించాలని లేఖలో కోరారు. అన్ని నాటో దేశాలు అంగీకరించి సుంకాలు వేయడానికి సద్ధంగా ఉన్నప్పుడు, తాను రష్యాపై పెద్ద ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ ప్రతిపాదనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘తాము యుద్ధానికి కుట్రలు పన్నడం లేదని, యుద్ధాల్లో పాల్గొనడం లేదని’’ చైనా కఠినమైన, స్పష్టమైన సందేశం ఇచ్చింది. స్లోవేనియా పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. యుద్ధం సమస్యలను పరిష్కరించలేదని, ఆంక్షలు వాటిని క్లిష్టతరం చేస్తాయని రాయిటర్స్‌లో అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ