హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లిలోని మేఎధా ప్రైవేట్ పాఠసాలలో డ్రగ్స్ తయారీపై సర్కార్ సీరియస్ అయింది. మేధా స్కూల్ ను సీజ్ చేసింది. ఈ మేరకు మేధా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. బాలానగర్ ఎంఈవో హరీశ్ చంద్ర ఆదేశాలతో స్కూల్ ను సీజ్ చేశారు. స్కూల్ లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిని ఇతర స్కూల్ లో చేర్పించేందుకు విద్యాసాఖ అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాఠశాల భవనంలో ఉదయం పూట పాఠశాల కొనసాగుతుండగా మరో రెండు గదుల్లో అల్పాజోలం తయారీ నిర్వహిస్తున్నట్లు ఈగల్ బృందం దాడుల్లో బయటపడింది. రెండేళ్ల క్రితం నుంచి పాఠశాలను జయప్రకాశ్ గౌడ్ నిర్వహిస్తుండగా ఈ స్కూల్ ను అడ్డం పెట్టుకుని మత్తు పదార్థాల తయారీ చేపట్టినట్లు తాజా దాడుల్లో బట్టబయలైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..