యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచివున్నారు.మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో సత్యవతి రాథోడ్కు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. దానికోసం యూరియ
మంత్రి సత్యవతి


మహబూబాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచివున్నారు.మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో సత్యవతి రాథోడ్కు ఐదున్నర ఎకరాల భూమి ఉంది. దానికోసం యూరియా బస్తాల కోసం ఆమె గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్దకు ఆదివారం నాడు వచ్చారు. యూరియా బస్తాల కోసం క్యూలైన్లో నిల్చున్నారు. తీరా ఆమె లైన్ వచ్చేసరికి ఒక్క బస్తా మాత్రమే అధికారులు ఇచ్చారు. దీనిపై మంత్రి సత్యవతి రాథోడ్ అసహనం వ్యక్తం చేశారు. ఐదున్నర ఎకరాల భూమికి ఒక్క బస్తా మాత్రమే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande