జెమిని ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా అకౌంట్ నుంచి రూ.70 వేలు మాయం
రాజన్న సిరిసిల్ల, 14 సెప్టెంబర్ (హి.స.) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈమధ్య కొందరు జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప
జెమినీ ఏ ఐ


రాజన్న సిరిసిల్ల, 14 సెప్టెంబర్ (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈమధ్య కొందరు జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది.

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్కు చెందిన ఓ యువకుడు ఇటీవల జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం కావడంతో షాక్కు గురయ్యాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande