హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు
విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్పై పోరుబాట అంటూ పీడీఎస్ఈూ రూపొందించిన బిగ్ డిబేట్ పోస్టర్ను హైదరాబాద్లోని తన నివాసంలో హరీశ్రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు