నిర్మల్, 14 సెప్టెంబర్ (హి.స.)
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్నారు. ఆదివారం కడెం మండలం సారంగాపూర్ గ్రామంలో రూ.12లక్షలతో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం గ్రామంలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. డ్రైనేజీ నిర్మాణం పనులు నాణ్యత కలిగి ఉండేలా చూడాలని అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..