తిరుమల, 14 సెప్టెంబర్ (హి.స.): తిరుమల శ్రీవారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, సవిత, సంధ్యారాణి, ఎంపీ పురందేశ్వరి, మాజీ మంత్రి పరిటాల సునీత శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. ప్రముఖులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ