ఐసీడీసీ ప్రాజెక్టులకు నిధులు.. ఈ నెల 17 నుంచి పోషణ కార్యక్రమాలు.. మంత్రి సీతక్క
హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర
మంత్రి సీతక్క


హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. చిన్నారులు, మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికీ పోషణ సందేశం చేరవేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు సీతక్క లేఖలు పంపారు. పోషణ మాసం మహోత్సవాన్ని నిర్వహించేందుకు వారు చురుకుగా పాల్గొనాలని, తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలకు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. కుటుంబ ఆరోగ్యానికి పోషకాహారం మొదటి అడుగు అయిన నేపథ్యంలో, ప్రతి ఇంటిలో పోషణపై చైతన్యం కల్పించడమే ఈ మాసం ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి ICDS ప్రాజెక్టుకు రూ.30,000, ప్రతి జిల్లాకు రూ.50,000 నిధులను విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande