హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)
ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. ఇవాళ గాంధీ భవన్ లో మల్లురవి నేతృత్వంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ జరిగింది. నేతల మధ్య విభేదాలు, పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపై చర్చించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లురవి తమకు ఫిర్యాదు రాలేదు కాబట్టే కోమటిరెడ్డి విషయంలో చర్చ జరగలేదన్నారు. తమకు ఫిర్యాదు రావాలని లేదా పీసీసీ చీఫ్ అయినా చెప్పాలన్నారు. బహిరంగంగా మాట్లాడితే ఎదుటివారికంటే ఎక్కువ పార్టీకి నష్టం చేస్తుందన్నారు. నేతల మధ్య విభేదాలపై స్పందిస్తూ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని అందరూ సమన్వయం పాటించాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు