వీఆర్ఏ వారసుల సమస్యలపై అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడుతా : జగ్గారెడ్డి
సంగారెడ్డి, 14 సెప్టెంబర్ (హి.స.) జీవో 81 /2023 లో మిగిలిన వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు, ఇచ్చేలా కృషి చేస్తానని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్
జగ్గారెడ్డి


సంగారెడ్డి, 14 సెప్టెంబర్ (హి.స.)

జీవో 81 /2023 లో మిగిలిన వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు, ఇచ్చేలా కృషి చేస్తానని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడుతానని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకొని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఆదివారం వీఆర్ఎ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా ఐబీ ఆఫీసులో 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఎ వారసులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలిసి రాష్ట్ర వ్యాప్తంగా జీవో 81/2023 లో మిగిలిన 3797 మంది 61+ సంవత్సరాల వారసుల సమస్య పరిష్కారం గురించి వివరించడం జరిగింది.

జీవో వచ్చి రెండు సంవత్సరాలు అయిందని, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఎ లు 480 మంది చనిపోయారని, వారి వారసులు ఆర్థిక సమస్యలతో పాటు, ఉద్యోగం రావడం లేదని మానసిక ఆందోళనతో దాదాపు 30 మంది చనిపోయారని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande