షాద్నగర్, 14 సెప్టెంబర్ (హి.స.)
క్రీడలు మానసిక దృఢత్వాన్ని
పెంపొందిస్తాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్నగర్ మినీ స్టేడియంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమక్షంలో అంజన్ గౌడ్ 1,50,000 విలువైన క్రికెట్ డ్రెస్సులు బూట్లు క్రీడా సామాగ్రిని క్రీడాకారులకు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలు మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా క్రీడల్లో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు