తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్ దూకుడు.. విస్తృతంగా తనిఖీలు
హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్ దూకుడు పెంచింది. పోలీసుల సహాకారంతో డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలపై తనిఖీలు చేపట్టారు. రైళ్లు, పారిశ్రామిక వాడలపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 9
ఈగల్ టీం


హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్ దూకుడు పెంచింది. పోలీసుల సహాకారంతో డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలపై తనిఖీలు చేపట్టారు. రైళ్లు, పారిశ్రామిక వాడలపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 91 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రైళ్లలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కోణార్క్ ఎక్స్ప్రెస్లో అక్రమంగా 32 కిలోల గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్లో మరో 214 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో అల్ఫాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ములుగు వాజేడులో 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాగే తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల పోలీసుల సహాకారంతో ఈగల్ టీమ్ దాడులు చేస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande