మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది
మహబూబాబాద్ 14 సెప్టెంబర్ (హి.స.) జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఇద్దరు వ్యక్తులు. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ప్రమాదం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది


మహబూబాబాద్ 14 సెప్టెంబర్ (హి.స.) జిల్లా గూడూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఇద్దరు వ్యక్తులు. గూడూరు నుండి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారిపై జగన్ నాయకులగూడెం స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. దుబ్బగూడెం కు చెందిన దారావత్ వీరన్న బానోత్ లాల్య యూరియా టోకెన్ల కోసం బొద్దుగొండ వస్తుండగా ద్విచక్ర వాహనం, బొలేరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బానోత్ వాల్య మృతి చెందాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహబుబాబాద్ జిల్లా ఆసుపత్రి కి తరలించారు.

పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద ఘటనతో బాధితుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కాగా గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతన్నలు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande