జయశంకర్ భూపాలపల్లి, 14 సెప్టెంబర్ (హి.స.) ఆదివారం ఉదయం భూపాలపల్లిలోని సింగరేణి నర్సరీ మైదానంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి భూపాలపల్లి ఏరియా వారి ఆధ్వర్యంలో వాన మావ వచనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం నాయక్ పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుడైన సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం 370 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బలరాం గారిని ఎమ్మెల్యే అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటివరకు 20వేలకు పైగా మొక్కలు నాటి తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా సింగరేణి సీ అండ్ ఎండి బలరాం రికార్డ్ సృష్టించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు