మహబూబాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) యూరియా కోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురంకి చెందిన రైతులు యూరియా కోసం వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాల్ అనే రైతు అక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ రైతు వీరన్న ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యూరియా కోసం ఇద్దరు రైతులు మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు, కుటుంబ సభ్యులు, రైతులు మహబూబాబాద్ జిల్లా హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి సత్యవతి రాథోడ్ రైతుల కుటుంబాలను పరామర్శించారు. వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. ప్రభుత్వం రైతుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని పట్టణంలోని ఏరియా హాస్పిటల్ ముందు ధర్నా చేస్తున్న రైతులు కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు