తారా స్థాయికి చేరుకున్న వరంగల్ కాంగ్రెస్ రాజకీయ విభేదాలు.
తెలంగాణ, 14 సెప్టెంబర్ (హి.స.) వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అదృష్టం కొద్దీ నాయిని రాజేందర్ రెడ్డి ఎమ
వరంగల్ కాంగ్రెస్


తెలంగాణ, 14 సెప్టెంబర్ (హి.స.) వరంగల్ జిల్లా కాంగ్రెస్లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అదృష్టం కొద్దీ నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కొండా సురేఖలా పూటకో పార్టీ మారితే నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక వీడియోను రిలీజ్ చేశారు.

తాము ఏది చేసినా నడుస్తోందని కొండా సురేఖ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలకమండలిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. అయినా నా నియోజకవర్గంలో ఆమె పెత్తనమేంటని అని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంబిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది దేనికని, తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని హెచ్చరించారు. ఈ విషయంలో కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్కు కూడా వారు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande