ప్రధాని మోడీ గుండెల్లో ఏపీ ఉంది: జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
విశాఖపట్టం, 14 సెప్టెంబర్ (హి.స.)ప్రధాని మోడీ(Pm Modi) గుండెల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP national president JP Nadda) తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(BJP state president Madhav) చేపట్టిన ‘
bjp-national-president-jp-nadda-said-that-andhra-pradesh-is-in-the-h


విశాఖపట్టం, 14 సెప్టెంబర్ (హి.స.)ప్రధాని మోడీ(Pm Modi) గుండెల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP national president JP Nadda) తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(BJP state president Madhav) చేపట్టిన ‘సారథ్యం యాత్ర’ ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఏపీ ప్రజల గుండెల్లో మోడీ ఉన్నారని జేపీ నడ్డా తెలిపారు.

ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ ప్రగతి పథకంలో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. మోడీ పాలనలో అభివృద్ధి పథంలో దేశం దూసుకుపోతుందని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. 2014కు ముందు దేశంలో వారసత్వ రాజకీయాలు నడచాయని, దాని వల్ల అవినీతి పేట్రేగిపోయిందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో 12 ఏళ్లుగా దేశం అభివృద్ధిలో వెనక్కి చూడటం లేదన్నారు. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని జేపీ నడ్డా తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande