అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.): ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో సీఎం పాల్గొనాల్సి ఉంది.భారీ వర్షం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటనను (Tirupati Tour Changes) రద్దు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయన తిరుపతి పర్యటన రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటలకే తిరుపతి చేరుకుని, 11 గంటలకు మహిళా సాధికారత సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. కానీ.. అమరావతి - తిరుపతి మధ్య ఆకాశంలో దట్టమైన మేఘాలు అలుముకుని ఉండటంతో సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతికి పయనమయ్యేందుకు ఏవియేషన్ అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో ఆయన పర్యటన రద్దయినట్లు తెలిపారు. కాగా.. అల్పపీడనం కారణంగా రాష్ర్టంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి