బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు
అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరికలు పెరిగాయి. గతంలో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన వారు, ఓడిపోయిన వారి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కూటమిలోని పార్టీలల
సునీత


అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల్లో చేరికలు పెరిగాయి. గతంలో వైసీపీ పార్టీ నుంచి గెలిచిన వారు, ఓడిపోయిన వారి.. ఆ పార్టీకి రాజీనామా చేసి.. కూటమిలోని పార్టీలలో చేరిపోతున్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎమమ్మెల్సీగా గెలిచిన పోతుల సునిత దంపతులు (Potula Sunitha couple) ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో వారు పార్టీలో చేరగా వారికి నడ్డా పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కాగా పోతుల సునీత 2017లో టీడీపీ నుంచి మొదటి సారి ఎమ్మెల్సీగా గెలవగా.. 2019లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే టీడీపీ టికెట్ ఇవ్వక పోవడంతో 2020లో రాజీనామా చేసి.. నాటి అధికార వైసీపీలో చేరింది. అనంతరం ఆమె ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవగా.. సంవత్సరం కిందట.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీకి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. అయితే మొదట ఆమె తిరిగి టీడీపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, చివరికి బీజేపీలో చేరి పోయారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande