తిరుమల, 14 సెప్టెంబర్ (హి.స.)కలియుగ ప్రత్యక్ష దైవం అయిన తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (Tirumala Tirupati లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
శుక్రవారం వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. శని, ఆదివారం వరుస సెలవులు రావడంతో.. ఒక్కసారిగా తాకిడి పెరిగిపోయింది. దీంతో ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ప్రస్తుతం తిరుమల కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ గెస్ట్ హౌస్ (Krishnateja Guest House) వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఈ క్రమంలో టోకెన్ ఉన్న భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా.. టోకెన్లు లేని భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 82149 భక్తులు దర్శించుకోగా.. 3.85 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి