2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : మంత్రి సత్యకుమార్
విశాఖపట్నం, 14 సెప్టెంబర్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2030 నాటికి భారత్ ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన సారథ్యం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ స
2030 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : మంత్రి సత్యకుమార్


విశాఖపట్నం, 14 సెప్టెంబర్ (హి.స.)ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2030 నాటికి భారత్ ను ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆదివారం విశాఖపట్నంలో నిర్వహించిన సారథ్యం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కార్ తో ఏపీని అభివృద్ధి చేస్తూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీని భౌగోళికంగా విస్తరించేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. బీజేపీ అభివృద్ధిని కాంక్షించే పార్టీ అన్నారు. వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రధాని మోదీ ఎంతో సహకారం అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేస్తోందని, ఇప్పటి వరకూ 10 కేంద్ర సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. మోదీ చొరవతోనే దివాలా తీసిన రాష్ట్రం గాడిన పడిందన్నారు. బీజేపీ జెండా, అజెండా ప్రజల్లో మమేకం కావాలని మంత్రిసత్యకుమార్ పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande