తిరుపతి, 14 సెప్టెంబర్ (హి.స.) ఒక్క రోజులో మహిళా సాధికారత(Women Empowerment) సాధ్యం కాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(lokhsabha speake Om Birla) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు(National Women Empowerment Conference) జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మహిళలకు గౌరవం ఇవ్వాలని, అది మన సంప్రదాయమని చెప్పారు. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలోనూ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదన్నారు. సామాజిక బంధాలను ఛేదించుకుని చాలా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. మహిళల కోసం రాజ్యాంగంలో చాలా నిబంధనలు రూపొందించబడ్డాయన్నారు. ప్రపంచంలోనే ముఖ్యంగా దేశంగా భారత దేశం అవతరించడానికి కారణం మహిళని స్పీకర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి