న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) నేపాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు జరిపింది. ఈ ఆందోళనలతో ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఈ హింసాత్మక ఆందోళనల్లో 50 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం, నేపాల్ మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కార్కీ ప్రధానిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, ఈ రాజకీయ గందరగోళం నేపథ్యంలో ప్రముఖ నటి మనీషా కోయిరాలా మాట్లాడిన పాత వీడియో వైరల్‌గా మారింది.
నేపాల్‌ను హిందూ దేశంగా పేర్కొంటూ, లౌకిక వాదాన్ని విమర్శిస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ‘నేపాల్ చారిత్రాత్మకంగా హిందూ దేశం, ఇది నేపాల్ గుర్తింపులో అంతర్భాగం’’ అని ఆమె అన్నారు. ఈ వీడియోను ఎక్స్‌లో ఒక యూజర్ షేర్ చేస్తూ.. మనీషా కోయిరాలా కొంతకాలం క్రితం నేపాల్ గురించి ఇలా చెప్పారు అనే క్యాప్షన్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ