దిల్లీ/ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.) బీమా రంగంలోకి 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను అనుమతించే బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం బీమా రంగంలోకి 74% ఎఫ్‌డీఐని అనుమతిస్తుండగా, దీన్ని 100 శాతానికి పెంచనున్నారు. ఇప్పటి వరకు ఎఫ్‌డీఐ ద్వారా బీమా రంగంలోకి రూ.82,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బీమా విపణిలోకి ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆహ్వానించడం, ఆర్థిక వృద్ధిని పెంచడం, ఉపాధి సృష్టించడం ఈ బిల్లు లక్ష్యం.
ప్రస్తుతం మనదేశంలో 25 జీవిత బీమా, 34 సాధారణ బీమా కంపెనీలున్నాయి. ఇందులోనే అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా, ఈసీజీసీ కూడా ఉన్నాయి.
బీమా రంగంలోకి ఎఫ్‌డీఐ పరిమితిని ప్రభుత్వం 2015లో 26% నుంచి 49 శాతానికి, 2021లో 49% నుంచి 74 శాతానికి పెంచింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ