వికారాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి
ఇంటిని సోమవారం ఉదయం అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. ప్రీప్రైమరి వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు కొడంగల్కు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని అక్కడినుంచి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు