మంచిర్యాల, 15 సెప్టెంబర్ (హి.స.)
మంచిర్యాల నుండి వందే భారత్”
హాల్టింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన సందర్భంగా మంచిర్యాల రైల్వే స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాష్ట్ర మంత్రి జి.వివేక్, స్థానిక ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని.. జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ సహకారంతోనే మంచిర్యాలలో వందే భారత్ రైలు హాల్టింగ్ వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు అల్లాడుతున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను కోరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్” చరిత్ర సృష్టిస్తుందన్నారు. నేడు దేశవ్యాప్తంగా 150 వందే భారత్ రైళ్లు నడుస్తున్నయని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు