రెండురోజుల పాటు.ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సమావేశం జరగనుంది
అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌరసేవల అమలు లాంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానిక
రెండురోజుల పాటు.ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సమావేశం జరగనుంది


అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, పౌరసేవల అమలు లాంటి కీలక అంశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సీసీఎల్ఏ, సీఎస్, రెవెన్యూ, ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. అయితే, మొదటి రోజు ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రసంగంతో మీటింగ్ స్టార్ట్ కానుంది. అనంతరం సీఎస్, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో ప్రెజెంటేషన్లు క్లిష్టంగా కాకుండా సూటిగా ఉండాలి.. ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ను విభిన్నంగా నిర్వహిస్తున్నాం.. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలులో జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ప్లాన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి మంత్రులకు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande