చట్టవిరుద్ధంగా ఉంటే..‘ఎస్‌ఐఆర్‌’ను రద్దు చేస్తాం: ఈసీకి ‘సుప్రీం’ హెచ్చరిక
న్యూఢిల్లీ,15,సెప్టెంబర్ (హి.స.) బిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar SIR)కు ఎన్నికల కమిషన్ (ECI) అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్‌’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను హెచ్చరించింది. అయితే
చట్టవిరుద్ధంగా ఉంటే..‘ఎస్‌ఐఆర్‌’ను రద్దు చేస్తాం: ఈసీకి ‘సుప్రీం’ హెచ్చరిక


న్యూఢిల్లీ,15,సెప్టెంబర్ (హి.స.)

బిహార్‌ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar SIR)కు ఎన్నికల కమిషన్ (ECI) అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్‌’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్లు పేర్కొంది. బిహార్‌లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సర్వేకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ విషయంపై తాము అసంపూర్తి అభిప్రాయాలు వెల్లడించలేమని..అక్టోబర్‌ 7న తుది వాదనలు విన్న తర్వాత తీర్పును వెలువరిస్తామని అత్యున్నత న్యాయస్తానం స్పష్టం చేసింది.

బిహార్‌ (Bihar) సమగ్ర ప్రత్యేక సవరణ(SIR)లో ఆధార్‌ను కూడా కచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఇటీవల సుప్రీం కోర్టు (Supreme Court) ఎన్నికల కమిషన్‌కు (ECI) మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు సూచనలు ఉన్నప్పటికీ ఎన్నికల అధికారులు ఆధార్‌ను గుర్తింపు కార్డుగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ చూపిస్తున్న అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆధార్ పౌరసత్వాన్ని నిరూపించలేకపోయినప్పటికీ.. అది ప్రజల గుర్తింపుకు చట్టబద్ధమైన రుజువుగా మిగిలిపోయిందని స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande