పెట్రోల్ డబ్బాలతో ప్రజావాణికి.. కలెక్టరేట్ ఆవరణలో గంగపుత్రుల నిరసన
తెలంగాణ, జగిత్యాల. 15 సెప్టెంబర్ (హి.స.) తమకు న్యాయం చేయాలంటూ మెట్పల్లి మండలం కోనరావుపేట కొండ్రికర్ల గ్రామానికి చెందిన గంగ పుత్రులు పెట్రోల్ డబ్బాలతో ప్రజావాణికి వచ్చారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వారిని అడ్డుకుని
జగిత్యాల


తెలంగాణ, జగిత్యాల. 15 సెప్టెంబర్ (హి.స.)

తమకు న్యాయం చేయాలంటూ మెట్పల్లి మండలం కోనరావుపేట కొండ్రికర్ల గ్రామానికి చెందిన గంగ పుత్రులు పెట్రోల్ డబ్బాలతో ప్రజావాణికి వచ్చారు. ఇది గమనించిన పోలీసు సిబ్బంది కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో వారిని అడ్డుకుని పెట్రోల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కార్యాలయ ఆవరణలోని గంగపుత్ర సంఘం సభ్యులు బైఠాయించి నిరసనకు దిగారు. తమ ఊరికి సంబంధించిన చెరువులపై ముదిరాజులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే విషయమై గత కొద్దిరోజులుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగడం లేదంటూ వాపోయారు. చెరువుల పైననే ఆధారపడి జీవించే తమకు వాటిపై హక్కులను కల్పించడంతోపాటు సొసైటీ ద్వారా చేసిన సభ్యత్వాలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande