హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం.. కేటీఆర్
హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రూ.20వేల కోట
కేటీఆర్


హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రూ.20వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో బకాయిలు పెడితే.. తాము అధికారంలోకి వచ్చి క్లియర్ చేశామని అన్నారు. కానీ, రేవంత్ సర్కార్ ఫీజు రీయింబర్స్మెంట్కు డబ్బులు లేవని సాక్షాత్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు.ఎన్నికల సందర్భంగా ప్రజలు కాంగ్రెస్ హామీలో చూసి మోసపోయారని కేటీఆర్ కామెంట్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande