చింత ఆకులతో షుగర్ కు చెక్.. కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే..
కర్నూలు, 15 సెప్టెంబర్ (హి.స.)చింతపండు, చింతకాయలు మాత్రమే కాదు..చింత ఆకులు కూడా అద్బుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవును చింత ఆకులను తినటం వల్ల చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. చింతపండు ఆకుల రసం
చింత ఆకులతో షుగర్ కు చెక్.. కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే..


కర్నూలు, 15 సెప్టెంబర్ (హి.స.)చింతపండు, చింతకాయలు మాత్రమే కాదు..చింత ఆకులు కూడా అద్బుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవును చింత ఆకులను తినటం వల్ల చెప్పలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. చింతపండు ఆకుల రసం తీసుకోవడం వల్ల రక్తహీనత నయమవుతుంది. దీంతో ఫ్రీ రాడికల్స్ సమస్య కూడా దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చింత ఆకుల రసంతో ప్లాస్మోడియం ఫాల్సిపరం అనే సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించే శక్తి ఉంది. ఈ సూక్ష్మజీవి మలేరియాకు కారణమవుతుంది. చింత ఆకుల రసం తీసుకోవడం వల్ల శరీరంలోని జీర్ణ సమస్యలను తొలగించడానికి సమర్థవంతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇది ఫైబర్ జీర్ణక్రియ ప్రక్రియను బాగా ఉంచుతుంది. తరచుగా ఆకలి సమస్య తగ్గుతుంది.

చింత ఆకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ సి లోపం వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. గాయాలు లేదా చర్మ వ్యాధులపై చింత ఆకుల రసాన్ని పూయడం వల్ల అవి త్వరగా నయం అవుతాయి. దీని యాంటీసెప్టిక్ లక్షణాలు చర్మంపై రక్షణ కవచంగా పనిచేస్తాయి. అంతేకాదు.. మధుమేహం ఉన్నవారు చింత ఆకులను తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.

చింత ఆకులు శరీరానికి ఉత్తేజాన్నిచ్చే లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తహీనత, అలసట వల్ల కలిగే వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఈ ఆకుల రసం తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాల నాణ్యత కూడా మెరుగుపడుతుంది. చింత చెట్టు ఆకులు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆకులు మూత్ర నాళాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande