సాంకేతిక లోపంతో ఆగిపోయిన మోనోరైలు..
ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.) మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మోనోరైలు మరోసారి ఆగిపోయింది. సోమవారం ఉదయం 7 గంటల తర్వాత స్టేషన్ నుంచి ప్రారంభం అయిన తర్వాత సగం దూరం వెళ్ళింది. అయితే సాంకేతిక లోపంతో పట్టాలపై నిలిచిపోయింది
ముంబై మోనో రైలు


ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.)

మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై ప్రజల

కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన మోనోరైలు మరోసారి ఆగిపోయింది. సోమవారం ఉదయం 7 గంటల తర్వాత స్టేషన్ నుంచి ప్రారంభం అయిన తర్వాత సగం దూరం వెళ్ళింది. అయితే సాంకేతిక లోపంతో పట్టాలపై నిలిచిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే లోకో పైలట్ టెక్నికల్ సిబ్బంది సహాయం కోరాడు. ఈ సమాచారం అందుకున్న MMRDA టెక్నికల్ సిబ్బంది హుటాహుటిన ట్రైన్ నిలిచిపోయిన ప్రదేశానికి చేరుకున్నారు. అనంతరం 30 నిమిషాల పాటు శ్రమించి మోనోరైలు ఉన్న 17 మంది ప్రయాణికులను బయటకు పంపించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande