భారత నావికాదళానికి సరికొత్త బలం.. రంగంలోకి జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక
హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.) భారత నావికాదళానికి మరో కీలక బలం లభించింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీరింగ్ (GRSE) నిర్మించిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక అండ్రోత్” (Androth) ను నావికాదళానికి అందచేశారు. తీరప్రాంతాల్లో జలాంత
యుద్ధనౌక


హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)

భారత నావికాదళానికి మరో కీలక బలం లభించింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీరింగ్ (GRSE) నిర్మించిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక అండ్రోత్” (Androth) ను నావికాదళానికి అందచేశారు. తీరప్రాంతాల్లో జలాంతర్గాములను గుర్తించడం, వాటిని తిప్పి కొట్టడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ నౌక, ASW Shallow Water Craft (ASW-SWC) శ్రేణిలో రెండవదిగా నిలిచింది. దాదాపు 77 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌకలో ఆధునిక సోనార్ వ్యవస్థలు, టార్పెడోలు, రాకెట్లను ప్రయోగించే సౌకర్యాలు ఉన్నాయి. జలాంతర్గాములే కాకుండా చిన్న మానవ రహిత నీటి వాహనాలు (UUVs), మినీ సబ్మెరైన్లను కూడా గుర్తించి వాటిపై దాడి చేసే సామర్థ్యం దీనికి ఉంది.

దేశీయ సాంకేతికతతోనే సుమారు 80 శాతం స్వదేశీ భాగాలను ఉపయోగించి ఈ నౌకను నిర్మించారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇప్పటికే 8 ASW-SWC నౌకలను నిర్మించేందుకు GRSE ఒప్పందం పొందగా, ఈ రెండవ నౌక డెలివరీతో ప్రాజెక్ట్ మరో ముఖ్య దశ పూర్తయింది. త్వరలో ఈ నౌక కమిషనింగ్ జరిగి సర్వీస్లో ప్రవేశిస్తుంది. కాగా ఇటీవల చైనా సహా ఇతర దేశాల సబ్మెరైన్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, తీర ప్రాంతాల రక్షణ, సముద్ర మార్గాల భద్రత, ద్వీప కల్పాల ఆస్తుల రక్షణలో ఈ నౌక ప్రధాన పాత్ర పోషించనుంది. తీరప్రాంతాల్లో ఉపరితలానికి దగ్గరగా పనిచేసే ఈ తరహా యుద్ధ నౌకలు, సముద్ర రణతంత్రంలో భారత నావికాదళానికి అదనపు శక్తిని అందజేస్తాయని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande