తిరుపతిలో పెరుగుతున్న రద్దీ కి అనుగుణంగా అత్యాధునిక బస్బ్స్టేషన్
అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పెరుగుతున్న యాత్రికుల రద్దీకి అనుగుణంగా అత్యాధునిక బస్‌స్టేషన్‌ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా, సౌకర్యంగా ఉండేలా నిర్మ
తిరుపతిలో పెరుగుతున్న రద్దీ కి అనుగుణంగా అత్యాధునిక బస్బ్స్టేషన్


అమరావతి, 15 సెప్టెంబర్ (హి.స.)ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో పెరుగుతున్న యాత్రికుల రద్దీకి అనుగుణంగా అత్యాధునిక బస్‌స్టేషన్‌ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రోజుకు సుమారు లక్ష మంది ప్రయాణికుల రాకపోకలకు వీలుగా, సౌకర్యంగా ఉండేలా నిర్మించనుంది. ఒకేసారి 150 బస్సులు నిలిపేందుకు వీలుగా బస్‌ బేతో పాటు రెండు ఎంట్రీలు, రెండు ఎగ్జిట్లు, ఎలక్ట్రిక్‌ బస్సులకు చార్జింగ్‌ సౌకర్యం, అందుకు సరిపడా విద్యుత్తు కోసం సోలార్‌ రూఫ్‌ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నేషనల్‌ హైవేస్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రతినిధులు, ఆర్టీసీ ధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతికి వచ్చే భక్తులు, బస్సుల సంఖ్య, ప్రస్తుత బస్టాండ్‌ సామర్థ్యం గురించి చర్చించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోయే కొత్త బస్‌ స్టేషన్‌కు సంబంధించిన ఐదు నమూనాలను సీఎం పరిశీలించారు. హెలిప్యాడ్‌, రోప్‌వే, కమర్షియల్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌లతో డిజైన్లు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని బస్‌ స్టేషన్లు ఆధునికీకరించే దిశగా

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande